
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ ప్రకటించింది. ఇక గత కొన్ని నెలలగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా విండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
జూలై 22 న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్
చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త రికార్డు