
Shikhar Dhawan will not be retained by Delhi Capitals: ఐపీఎల్ 15వ సీజన్ కోసం రిటైన్ ప్లేయర్స్ లిస్ట్‌ను సమర్పించడానికి గడువు దగ్గరపడతుండటంతో ఆయా జట్లు తుది జాబితా సిద్దం చేసుకుంటున్నాయి. ఈ జాబితాను ఆయా జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో ఏ జట్లు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటారో అన్నదానిపై సర్వత్రా అసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు తరుపున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్‌ను వదులుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. రాబోయే సీజన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహించునున్న సంగతి తెలిసిందే.
అయితే శ్రేయాస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, కగిసో రబాడాలను వదులుకోవాలని ఆజట్టు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధేవిధంగా పృథ్వీ షా, అక్షర్ పటేల్ రిటైన్డ్ చేసుకోవాలి అని ఢిల్లీ భావిస్తోందంట. కాగా ఐపీఎల్-2022 కోసం మెగా వేలం డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సారి రెండు కొత్త జట్లు రావడంతో వేలంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment