వెస్టిండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్‌తో సహా మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణైంది. ఈ నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ను విండీస్‌తో తలపడే భారత వన్డే జట్టులో చేర్చింది. మయాంక్ చివరగా వన్డేల్లో 2020లో ఆస్ట్రేలియాతో ఆడాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న జరగనుంది. కాగా మూడో మ్యాచ్ ఫిబ్రవరి 11న జరగనుంది. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. కాగా ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్
చదవండి: IND Vs WI: టీమిండియాలో కరోనా కలకలం.. ముగ్గురు స్టార్ క్రికెటర్లకు పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment