
Shikhar Dhawan sweats it out in training session: భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ఓపెనర్ శిఖర్ ధావన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచకున్నాడు. ఇక ఈ ఏడాదిలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్.. టీ20 ప్రపంచకప్‌తో పాటు, స్వదేశంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఎన్నో అధ్బుత విజయాలు అందించిన ధావన్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలు, క్రికెట్ నిపుణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
చివరగా ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడిన ధావన్.. 587 పరుగుల తో అధ్బుతంగా రాణించాడు. కాగా 2021 ఏడాదికుగాను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్‌తో ధావన్‌ను సత్కారించింది. కాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ధావన్.. "అర్జున అవార్డును అందుకోవడం నాకు గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కోచ్‌లు, వైద్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ, సహచరులు, అభిమానులు, నా స్నేహితులు నా కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ధావన్ రాసుకొచ్చాడు.