బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇక ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్న రోహిత్ సేన నెట్ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా త్రోడౌన్ స్పెషలిస్టులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
అదే విధంగా భారత వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా చాలా సమయం నెట్స్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. మరోవైపు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలోని ఆలూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్‌కు గుడ్ న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు
#TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA
— BCCI (@BCCI) February 3, 2023
Comments
Please login to add a commentAdd a comment