Shikhar Dhawan And Ravindra Jadeja Latest Instagram Dance Video Goes Viral - Sakshi
Sakshi News home page

జడేజా ముందు డ్యాన్స్‌ చేసిన ధావన్‌.. వీడియో వైరల్‌!

Published Sat, Sep 24 2022 4:34 PM | Last Updated on Sat, Sep 24 2022 7:34 PM

Shikhar Dhawans Latest Instagram Reel With Ravindra Jadeja - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆన్‌ ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పడు ఫ్రాంక్‌ వీడియోలతో, తన డ్యాన్స్ రీల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజగా మరోసారి ఓ ఫన్నీ వీడియోను తన సోషల్‌ మీడియాలో ఖాతాలో ధావన్‌ షేర్‌ చేశాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను తాజాగా ధావన్‌ కలిశాడు.

ఈ సందర్భంగా జడేజా ముందు ధావన్‌ డ్యాన్స్‌ చేశాడు. "ఇస్కీ షాదీ కర్వా డిజియే, జిమ్మెదారీ అయేగీ టు సుధర్ జయేజా"(అతడికి పెళ్లి చేయండి. బాధ్యత వస్తే,‍ తిరిగి ట్రాక్‌లోకి వస్తాడు). అనే ఫేమస్ బాలీవుడ్ డైలాగ్‌కు జడేజా పెదవి సింక్ చేయగా.. ఆనందంతో ధావన్ డ్యాన్స్ చేశాడు. అదే విధంగా ఆ వీడియోక​ఉ " ఇప్పుడే కాదు ఇంకా సమయం ఉంది" అని క్యాప్షన్‌ను ధావన్‌ జోడించాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియోపై స్పందిస్తూ..  తన  సహచర ఆటగాళ్లు అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌-2022కు జడేజా దూరం కాగా.. ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ధావన్‌ సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.


చదవండి: IND VS AUS: రోహిత్‌ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్‌ గవాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement