ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. బుధవారం(నవంబర్ 2) జరిగిన బోర్డు మీటింగ్‌లో కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది.
ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో మయాంక్‌ను తప్పించి జట్టు పగ్గాలను ధావన్‌కు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది.
అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనిల్ కుంబ్లేను తప్పించి ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌తో కూడా పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వచ్చే ఏడాది సీజన్‌లో కొత్త కోచింగ్ స్టాప్, కొత్త కెప్టెన్‌లతో పంజాబ్ బరిలోకి దిగనుంది.
చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయింటే విజయం మాదే: షకీబ్
Comments
Please login to add a commentAdd a comment