
శిఖర్ ధావన్(PC: IPL/BCCI)
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 50 పైగా పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా ధావన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో మెరిసిన ధావన్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే 48 సార్లు 50 పరుగుల స్కోరు దాటిన విరాట్ కోహ్లిని ఈ మ్యాచ్‌లో ధావన్ వెనుక్కి నెట్టాడు.
217 మ్యాచ్‌ల్లో 48 సార్లు 50 పైగా పరుగులు కోహ్లి సాధించగా.. 202 ఇన్నింగ్స్‌లలోనే 49 సార్లు 50 పైగా పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 57 సార్లు 50 పైగా పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ధావన్ రెండో స్థానంలో నిలిచాడు.
చదవండి: IPL 2022: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment