
Photo Credit: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి 40 పరుగులతో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ 191 పరుగుల భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. బానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు.
ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా ధావన్ నిలిచాడు. ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 94వ అర్థశతక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విషయంలో కోహ్లి రికార్డును సమం చేశాడు. ఆర్‌సీబీ తరపున కోహ్లి కూడా 94 అర్థశతక భాగస్వామ్యాలు అందించాడు.
ఇక అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలతో ఈ ఇద్దరు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో సురేశ్ రైనా(83 అర్థశతక భాగస్వామ్యాలు), డేవిడ్ వార్నర్ 82 50ప్లస్ భాగస్వామ్యాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక 29 బంతుల్లో 40 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు ఉన్నాయి.