న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం(నవంబర్25) న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు.
ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఇక కివీస్‌తో జరగనున్న తొలి వన్డేలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో అతడిని ఆడించాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా దీపక్ హుడా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు పేసర్ దీపక్ చాహర్ తొలి వన్డేకు దూరమమ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ భారత తరపున వన్డే అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆక్లాండ్‌కు చేరుకున్న ధావన్ సేన ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.
తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్(కెప్టెన్),శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!
Comments
Please login to add a commentAdd a comment