
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యాకు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పంజాబ్, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు.
టాస్ వేయడానికి ముందు ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్‌ను హగ్ చేసుకున్న పాండ్యా అతని చెంపపై ముద్దుపెట్టడం అభిమానులకు ఆనందం కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇదే పాండ్యా ధావన్ ఔటైనప్పుడు తెగ సంబరపడిపోయాడు. ఇందుకు ఒక కారణం ఉంది. ధావన్ ఈ సీజన్‌లో భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 8 పరుగులకే వెనుదిరగడంతో పాండ్యాకు ఎక్కడిలేని సంతోషం కలిగింది. అందుకే ధావన్‌వైపు చూస్తూ రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్లుగా గట్టిగా అరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటో ఈ పాండ్యా సిత్రాలు.. మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు.'' అంటూ కామెంట్ చేశారు.
Hardik Pandya with Shikhar Dhawan.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023
What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb
Comments
Please login to add a commentAdd a comment