న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మూడో వన్డే సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు.
అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాగా గత మూడు రోజుల నుంచి దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూ వెదర్ పేర్కొంది.
అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 40 శాతం వర్షంపడే అవకాశం ఉంది. అదే విధంగా ఉష్ణోగ్రత కూడా 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది అని అక్యూ వెదర్ తెలిపింది. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
తుది జట్లు(అంచనా):
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment