టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ దావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు.
దీంతో ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. కొన్నాళ్ల పాటు కుమారుడితో విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అదే విధంగా ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా తనను ఒత్తిడి చేసిందన్న ధావన్ ఆరోపణను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది.
కాగా ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్‌కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది.
కాగా వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత ధావన్-ఆయేషా వ్యక్తిగత కారణాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2021లో ధావన్‌తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషానే స్వయంగా వెల్లడించింది.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?:
Comments
Please login to add a commentAdd a comment