
courtesy: Delhi Capitals Twitter
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కరోనాతో లీగ్ వాయిదా పడే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్స్ శిఖర్ ధావన్, పృథ్వీ షాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. పృథ్వీ షా ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేయగా.. ఇక శిఖర్ ధావన్ తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు.
చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం
తాజాగా శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఒక హిందీ టీవీ షోలోని డైలాగ్‌లను తమ స్టైల్లో అనుకరించారు. పృథ్వీ తన హావభావాలతో ఆకట్టుకోగా.. ధవన్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సీజన్ రెండో అంచె మరికొద్ది గంటల్లో మొదలవనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
చదవండి: IPL 2021: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు..