
Rishab Pant And MS Dhoni Conversation Before Toss.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ సోమవారం 24వ బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిన పంత్ ధోనికి వీరాభిమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోనిని పంత్ తన గురువుగా భావిస్తాడని అభిమానులు చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ధోని, పంత్‌ల మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్‌కు ముందు ఇద్దరికి ఫన్నీ సంభాషణ జరిగింది.
చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. బహుశా పంత్ పుట్టినరోజు కావడంతో ధోనిని సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేసుంటాడని అభిమానులు పేర్కొన్నారు. అభిమానుల మాటల్లో వారి సంభాషణ ఈ విధంగా ఉంది. తనకు బర్త్‌డే గిఫ్ట్ ఏం లేదా అంటూ ధోనిని అడగ్గా.. అందుకు ధోని ఏం లేదని నవ్వాడు. దీంతో పంత్ ధోని చేతికున్న వాచ్‌ను చూపిస్తూ ఇది నాకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చుగా అని అడిగాడు. దానికి ధోని ఏం చెప్పకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో మొదట చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించే ఆట ఆడారు.
చదవండి: T20 World Cup 2021: టీమిండియా క్యాప్ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు
Pure bliss 😍@msdhoni @RishabhPant17 #CSKvsDC 💛💙 pic.twitter.com/dHpe6FIY3F
— Vardhan🔔🦁💛 (@me_vardhan9) October 4, 2021