photo credit: IPL Twitter
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్‌సీబీ ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్‌లు చెరొక వికెట్ తీశారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్
147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు.
ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్
106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు.
76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్
పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది.
సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్ప్రీత్ సింగ్ (13) పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్‌సిమ్రన్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్‌లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్‌లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్‌స్టోన్‌ను ఔట్ (ఎల్బీ) చేశాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు.
టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్‌కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.
డుప్లెసిస్ (84) ఔట్
ఇల్లిస్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్‌లో ఉన్నారు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ ఔట్
ఆర్సీబీకి వరుస షాక్‌లు తగిలాయి. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?
40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్‌లో ఉన్నాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్
ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్‌కు జతగా కోహ్లి (39) క్రీజ్‌లో ఉన్నాడు.
ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి
ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment