లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..! | IPL 2023 LSG VS RCB Lucknow Match Highlights And Updates | Sakshi
Sakshi News home page

లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..!

Published Mon, May 1 2023 7:10 PM | Last Updated on Mon, May 1 2023 11:39 PM

IPL 2023 LSG VS RCB Lucknow Match Highlights And Updates - Sakshi

లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..!
ఐపీఎల్‌ 2023 సీజన్‌లో మరో సంచలనం నమోదైంది. ఈ సీజన్‌లో అసాధ్యమనుకున్న టార్గెట్లను కొన్ని జట్లు ఛేదించి, అద్భుత విజయాలు సాధించగా.. ఇవాళ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకుని సంచలన విజయం సాధించింది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోహ్లి (31), డుప్లెసిస్‌ (44), దినేశ్‌ కార్తీక్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హాక్‌ 3, బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

స్వల్ప లక్ష్యఛేదనలో ఆది నుంచే తడబడుతూ వచ్చిన లక్నో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 108 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్‌ చేసుకున్న ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఇన్నింగ్స్‌లో కృష్ణప్ప గౌతమ్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్‌ శర్మ, హాజిల్‌వుడ్‌ తలో 2 వికెట్లు, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇద్దరు రనౌటయ్యారు. ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్‌ రాహుల్‌ కూడా లక్నోను గెలిపించలేకపోయాడు. 

ఓటమి దిశగా లక్నో 
స్వల్ప లక్ష్య ఛేదనలో చతికిలపడిన లక్నో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. బిష్ణోయ్‌ (5) రనౌటయ్యాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన లక్నో  
66 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్‌ కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. భారీ షాట్లు ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ (23)రనౌటయ్యాడు. 

65 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయిన లక్నో 
65 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్‌ కోల్పోయింది. కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో సుయాశ్‌కు క్యాచ్‌ ఇచ్చి డేంజరెస్‌ స్టోయినిస్‌ (13) ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 65/6. కృష్ణప్ప గౌతమ్‌ (22), బిష్ణోయ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో 
స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కర్ణ శర్మ బౌలింగ్‌లో లోమ్రార్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (9) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 53/5. స్టోయినిస్‌ (10), కృష్ణప్ప గౌతమ్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. 

టార్గెట్‌ 127.. లక్నో 27/4
127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హసరంగ బౌలింగ్‌లో హుడా (1) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దినేశ్‌ కార్తీక్‌ అద్భుతమైన స్టంపింగ్‌ చేసి హుడాను పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కొర్‌ 34/4. స్టోయినిస్‌ (6), పూరన్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. 

టార్గెట్‌ 127.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో
127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సైతం వడివడిగా వికెట్లు కోల్పోతుంది. 5 బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత కృనాల్‌ పాండ్యా (14) ఆతర్వాత ఆయుష్‌ బదోని (4) పెవిలియన్‌కు చేరారు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో కృనాల్‌.. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో బదోని ఔటయ్యారు.  

టార్గెట్‌ 127.. రెండో బంతికే వికెట్‌ కోల్పోయిన లక్నో
127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేనదలో లక్నో రెండో బంతికే వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో కైల్‌ మేయర్స్‌ డకౌటయ్యాడు. 

ఆర్సీబీ చెత్త ఆటతీరు.. లక్నో టార్గెట్‌ 127
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ చెత్త ఆటతీరు ప్రదర్శించింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోహ్లి (31), డుప్లెసిస్‌ (44), దినేశ్‌ కార్తీక్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హాక్‌ 3, బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..
ఆర్సీబీ 7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. నవీన్‌ ఉల్‌ హాక్‌ బౌలింగ్‌లో లోమ్రార్‌ (3), దినేశ్‌ కార్తీక్‌ (16) రనౌట్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌ బౌలింగ్‌లో వరస బంతుల్లో కర్ణ శర్మ (2), సిరాజ్‌ (0) ఔటయ్యారు.   

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్‌ ఔట్‌
అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో డుప్లెసిస్‌ (44) ఔటయ్యాడు. కృనాల్‌ పాండ్యా అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకుని డెప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 110/5. క్రీజ్‌లో కార్తీక్‌ (13), లోమ్రార్‌ (1) ఉన్నారు. 

వర్షం అంతరాయం
15.2 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. డుప్లెసిస్‌ (40), కార్తీక్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్‌ 93/4. 

పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. నాలుగో వికెట్‌ డౌన్‌ 
అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టడంతో సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (6) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 92/4. డుప్లెసిస్‌ (39), దినేశ్‌ కార్తీక్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

కష్టాల్లో ఆర్సీబీ.. మూడో వికెట్‌ డౌన్‌
79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో చిక్కుకుంది. బిష్ణోయ్‌ మరోసారి మాయ చేశాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడబోయన మ్యాక్సీ (4) అది మిస్‌ కావడంతో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 82/3. డుప్లెసిస్‌ (35), సుయాశ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. రావత్‌ ఔట్‌
కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో అనుజ్‌ రావత్‌ (9) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రావత్‌.. కైల్‌మేయర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 78/2. డుప్లెసిస్‌ (33), మ్యాక్స్‌వెల్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
రవి బిష్ణోయ్‌ పన్నిన ఉచ్చులో విరాట్‌ కోహ్లి (31) చిక్కాడు. కింగ్‌ భారీ షాట్‌ ఆడేందుకు ముందుకు వస్తున్నాడని ముందే పసిగట్టిన బిష్ణోయ్‌ తెలివిగా ఔట్‌ ఆఫ్‌ ద హాఫ్‌ స్టంప్‌ బంతిని సంధించాడు. కోహ్లి బంతిని కనెక్ట్‌  చేసుకోలేకపోగా, వికెట్‌ కీపర్‌ పూరన్‌ అలర్ట్‌గా ఉండి స్టంపింగ్‌ చేశాడు. దీంతో కోహ్లి పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 62/1. డుప్లెసిస్‌ (29), అనుజ్‌ రావత్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

నిదానంగా ఆడుతున్న కోహ్లి, డుప్లెసిస్‌.. 6 ఓవర్ల తర్వాత స్కోర్‌ ఎంతంటే..?
ఆర్సీబీ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (21), డుప్లెసిస్‌ (21) నిదానంగా ఇ​న్నింగ్స్‌ను ఆరంభించారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.  పవర్‌ ప్లేలో ఆర్సీబీ 3 ఫోర్లు, ఓ సిక్సర్‌ మాత్రమే కొట్టింది. కృనాల్‌ పాండ్యా (3-0-14-0)  అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్‌ 2023లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మే 1) లక్నో సూపర్‌ జెయింట్స్‌-ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి, డుప్లెసిస్‌ (కెప్టెన్‌), అనుజ్‌రావత్‌, మ్యాక్స్‌వెల్‌, మహిపాల్‌ లోమ్రార్‌, దినేశ్‌ కార్తీక్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, వనిందు హసరంగ, కర్ణ్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌

లక్నో: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, స్టోయినిస్‌, కృనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌, కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోయ్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, అమిత్‌ మిశ్రా, యశ్‌ ఠాకూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement