ఉత్కంఠపోరు.. రాజస్తాన్‌పై ఆర్‌సీబీ విజయం
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా. యశస్వి జైశ్వాల్ 47, ద్రువ్ జురేల్ 34 నాటౌట్ చివరి వరకు నిలిచినప్పటికి రాజస్తాన్‌ను గెలిపించలేకపోయాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్‌లు చెరొక వికెట్ తీశారు.
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (22) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
108 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో యశస్వి జైస్వాల్ (47) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 108/3. సంజూ శాంసన్ (7), హెట్‌మైర్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
పడిక్కల్ (52) ఔట్
విల్లే బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు.
బాధ్యతగా ఆడుతున్న జైస్వాల్, పడిక్కల్
ఒక్క పరుగు వద్దే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. యశస్వి జైస్వాల్ (42), దేవ్‌దత్ పడిక్కల్ (39) బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 81/1గా ఉంది.
సిరాజ్ సింహ గర్జన.. బట్లర్ క్లీన్ బౌల్డ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్న సిరాజ్ ఇవాల్టి మ్యాచ్‌లోనూ చెలరేగాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే సిరాజ్ బట్లర్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాక్సీ, డుప్లెసిస్ మెరుపులు.. అయినా భారీ స్కోర్ చేయలేకపోయిన ఆర్సీబీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్ తర్వాత కూడా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. ఆ జట్టు 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి దారుణంగా నిరాశపర్చింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్‌కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు.
పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ బ్యాటర్లు
13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టంగా ఉండిన ఆర్సీబీ.. ఆతర్వాత పేకమేడలా కూలిపోతుంది. డుప్లెసిస్ (62) రనౌట్‌తో ఆర్సీబీ పతనం మొదలైంది. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (77), చహల్ బౌలింగ్‌లో లోమ్రార్ (8) పెవిలియన్ బాట పట్టారు. అదే ఓవర్‌లో (17) ప్రభుదేశాయ్ (0) కూడా రనౌటయ్యాడు. 24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 164/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (3), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు.
చితక్కొడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్
మ్యాక్స్‌వెల్ (35 బంతుల్లో 64), డుప్లెసిస్ (34 బంతుల్లో 56) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 128/2గా ఉంది.
ధాటిగా ఆడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్
ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 40), డుప్లెసిస్ (18 బంతుల్లో 30) ఆదుకుంది. వీరిద్దరు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 7 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 72/2గా ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
12 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు.
తొలి బంతికే కోహ్లి ఔట్.. గోల్డెన్ డక్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లి తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 3: 30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), డుప్లెసిస్, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాఖ్
రాజస్థాన్: సంజూ శాంసన్ (కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చహల్
Comments
Please login to add a commentAdd a comment