photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాక, దాదాపు 15 నెలల అనంతరం కోహ్లి ఇలా ఓ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. 2022 జనవరి 11న కోహ్లి చివరిసారిగా భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. టెస్ట్‌ల్లో విజయవంతమైన కెప్టెన్ అయిన కోహ్లి ఊహించని పరిణామాల నడుమ ఓటమితో కెప్టెన్సీ కెరీర్ ముగించాడు.
డుప్లెసిస్ ఉన్నా కోహ్లి ఎందుకు..?
పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. నొప్పి కారణంగా అతను ఫీల్డింగ్ చేయలేకపోవడంతో అతని స్థానంలో కోహ్లి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆర్సీబీ బౌలింగ్ సమయంలో డుప్లెసిస్‌కు రీప్లేస్‌మెంట్‌గా విజయ్‌కుమార్ వైశాఖ్ బరిలోకి దిగనున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్‌కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్ బౌలరల్లో హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment