విజృంభించిన ప్రతీక్, గౌరవ్ | sri chaitanya college beats neeraj public school by 290 runs | Sakshi
Sakshi News home page

విజృంభించిన ప్రతీక్, గౌరవ్

Published Fri, Nov 4 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

sri chaitanya college beats neeraj public school by 290 runs

సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ బ్యాట్స్‌మెన్ ప్రతీక్ (132 బంతుల్లో 192; 24 ఫోర్లు, 1 సిక్సర్), గౌరవ్ రెడ్డి (109 బంతుల్లో 178 నాటౌట్; 29 ఫోర్లు) విజృంభించారు. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా నీరజ్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 290 పరుగుల తేడాతో ఆజట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య కాలేజ్ జట్టు 45 ఓవర్లలో 3 వికెట్లకు 438 పరుగులు చేసింది.

 

ప్రతీక్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా... గౌరవ్ రెడ్డి అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం 439 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నీరజ్ పబ్లిక్ స్కూల్ తడబడింది. 45 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శశాంక్ లోకేశ్ (62నాటౌట్), మొహమ్మద్ ఇస్మారుుల్ (32) పోరాడారు.

ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

 సెయింట్ మేరీస్ (యూసఫ్‌గూడ): 275 ( గోపీ 157, శ్రీకాంత్ 57; మొహమ్మద్ ఫహాద్ 4/47, దుర్గేశ్ యాదవ్ 5/51), సుప్రీమ్ హైస్కూల్: 149 (తరుణ్ 35; శ్రీకాంత్ 5/32, నిహాంత్ 4/78).       

 గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్: 217 (రుత్విక్ 49 నాటౌట్, జ్ఞాన ప్రకాశ్ 79; ప్రణయ్ అగర్వాల్ 3/31, సహేంద్ర మల్లు 5/47), ఓక్రిడ్‌‌జ: 126 (సహేంద్ర 50, జ్ఞాన ప్రకాశ్ 4/38).  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement