ఖమ్మం గెలుపు | khammam won inter district title | Sakshi
Sakshi News home page

ఖమ్మం గెలుపు

Published Thu, Aug 18 2016 12:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

khammam won inter district title

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రి కెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా బాలికల క్రికెట్ టోర్నమెంట్‌లో ఖమ్మం జట్టు, కంైబె న్డ్ డిస్ట్రిక్ ఎలెవన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది. అనంతరం ఖమ్మం జట్టు 9 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో నిజామాబాద్ జట్టు 27 పరుగుల తేడాతో నల్గొండ జట్టుపై విజయం సాధించింది.

 

తొలుత నిజామాబాద్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేయగా... నల్గొండ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 66 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 10 వికెట్ల తేడాతో కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కరీంనగర్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేయగా... ఆదిలాబాద్ జట్టు 8.3 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 76 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement