counsilars
-
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
చేయి పట్టుకున్నాడు.. చెప్పుతో కొట్టాను!
లక్నో : ఉత్తరప్రదేశ్ మధురలో పురపాలక శాఖలో పనిచేసే ఓ ఉద్యోగిపై దాడి చేశారన్నా ఆరోపణలతో బిజెపి కౌన్సిలర్ దీపిక రాణి సింగ్, ఆమె భర్త పుష్పేంద్ర సింగ్ పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. శుక్రవారం మధుర మున్సిపల్ కమిషనర్ రవీందర్ కుమార్, అతని వ్యక్తిగత సహాయకుడిపై కౌన్సిలర్ దీపిక రాణి భౌతిక దాడికి పాల్పడింది. ఈ విషయంపై ఆమెను వివరణ కోరగా.. తన ప్రాంత సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించి కమిషనర్‌తో మాట్లాడుతుండగా, తన పక్కన కూర్చోమని బలవంతంగా చేయి పట్టుకున్నాడని ఆమె ఆరోపించించారు. అయితే దీపికారాణి ఆరోపణలను రవీందర్ కుమార్ కొట్టిపరేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలకు రూపొందిన బడ్జెట్‌కి సంబందించి ఓ సమావేశం ఏర్పాటుచేయగా కౌన్సిలర్లు, ఉన్నతాధికారులు సహా ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారని తెలిపారు. అయితే సమావేశం ప్రారంభించడానికి కొంత సమయం ముందు కౌన్సిలర్ వాణి కావాలనే ఒక రభస సృష్టించిందని ఆరోపించారు. ఆమెను శాంతింపజేయడానికి తన పీఏ ప్రయత్నించగా అతడ్ని చెప్పలతో కొట్టింది అని పేర్కొన్నాడు. కార్పొరేషన్ తరపున ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపాడు. (ఆలీ పేరిట నకిలీ ట్విటర్ అకౌంట్) . -
కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత!
సాక్షి, కామారెడ్డి: నగర మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిని బీ-ఫారం ఇచ్చి వెళ్లాలని ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. అలాగే ఇతర అభ్యర్థులు ఆయనపై దాడికి యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ కింద పడిపోయాడు. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలతో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక కౌన్సిలర్ సీట్లను అమ్ముకున్నారంటూ బీజేపీ అభ్యర్థులు మున్సిపల్ నామినేషన్ విత్ డ్రా సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బీ-ఫారం ఫామ్‌ను చింపెందుకు అభ్యర్థులు యత్నించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆశవాహులు సైతం మున్సిపల్ విత్ డ్రా సెంటర్ వద్ద ఆందోళన చేశారు. సిట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. -
అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు
సాక్షి, మంగళగిరి: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాన్ని పేదలకు కాకుండా తాము సొమ్ము చేసుకునేందుకు అన్నట్లుగా మున్సిపల్ టీడీపీ పాలకులు వార్డుల వారీగా ఇళ్లు కేటాయించుకుని ఒక్కో ఇంటిని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. పథకంలో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజాప్రతినిధులే ధర్నాలకు దిగడంతో లబ్ధిదారుల జాబితాను ప్రకటించలేకపోయారు. ఒక్కో కౌన్సిలర్ వార్డుకు కేటాయించిన ఇళ్లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేయగా, చైర్మన్, షాడో చైర్మన్లు రూ.కోటికిపైగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో డబ్బులు వసూలు చేసిన ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లబ్ధిదారులు తమకు ఇళ్లు రాకపోతే తీసుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి కట్టిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతుండడంతో కొత్తనాటకానికి తెరతీశారు. లబ్ధిదారులలో తమ బినామీలైన ఐదుగురు మహిళలను గ్రూపు లీడర్లుగా ఎంపిక చేసి, కొంత మంది లబ్ధిదారులను రెచ్చగొట్టి ప్రతి రోజు తమకు ఇళ్లు కావాలంటూ మున్సిపాల్టీతో పాటు ఇళ్ల నిర్మాణం వద్ద ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2,300 మంది లబ్ధిదారులుండగా ప్రతి రోజు ఆందోళన పేరుతో 30 మంది మహిళలు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా, ఐదుగురు మహిళలు వారికి లీడర్లుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇళ్లు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ప్రతి రోజు ఆందోళన చేస్తుండడం వెనుక డబ్బులు తీసుకున్న కొందరు కౌన్సిలర్లు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణ వాస్తవానికి డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇచ్చేదానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందరికీ ఇళ్లు పథకంపై విజిలెన్స్ విచారణ కోరగా, విజలెన్స్ విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన వెంటనే అర్హులు జాబితాను విడుదల చేసి ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ లోపు తాము ఎక్కడ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలనే ఆందోళనతో మాజీ కౌన్సిలర్లు పన్నాగం ప్రకారం లబ్ధిదారులతో పాటు అమ్ముకున్న ఇళ్ల వారిని రెచ్చకొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి గత కొద్ది కాలంగా మాజీ కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులు అనర్హులు తమకు ఇళ్లు రావని తెలుసుకుని తాము ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని మాజీ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు స్థానికంగా ఉన్న బలంతో ఇళ్లు వస్తాయని, రాకుంటే మీ డబ్బు మీకు ఇస్తామంటూ బాధితుల నోరు మూయిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ఒక్కో వార్డులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన మాజీ కౌన్సిలర్లతో పాటు రూ.కోట్లు వసూలు చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్, షాడో చైర్మన్లు బాధితులు తీసుకువస్తున్న ఒత్తిడి నుంచి బయటపడే పరిస్థితి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు అర్హుల జాబితాను విడుదల చేసినట్లయితే అనర్హుల నుంచి వసూలు చేసిన డబ్బులతో అర్హుల వద్ద అధిక సంఖ్యలో వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకతప్పదు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాల్టీని అవినీతి కూపంగా మార్చారనే అపప్రద మూటకట్టుకున్న టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఇప్పుడు అందరికీ ఇళ్ల పథకంలో అంటిన అవినీతి మురికిని వదిలించుకోలేని పరిస్థితిలో బాధితులు కేసులు పెడితే శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితే లేదని అధికారులతో పాటు ఆయా పార్టీల నాయకులు చెబుతుండడం విశేషం. దీనిపై మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో గతంలో డీడీలు కట్టిన అర్హులందరికీ తప్పకుండా ఇళ్లు ఇస్తామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అనర్హులు తేలితే వారిని తొలగించి వారి స్థానంలో 1,728 ఇళ్ల జాబితా అనంతరం డీడీలు కట్టిన అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. అనవసరంగా ఆందోళనలు చేసి అధికారుల సమయం వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. -
మున్సిపల్ కౌన్సిలర్లకు సదుపాయాలు కల్పించాలి
హుజూర్నగర్ : రాష్ట్రంలోని మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని తెలంగాణ మున్సిపల్, నగరపంచాయతీ కౌన్సిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్.ప్రసాద్ కోరారు. సోమవారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌన్సిలర్లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలన్నారు. హెల్త్‌కార్డులు అందజేయడంతో పాటు రూ.5 లక్షల వరకు ఫండ్‌ను నామినేషన్ పద్ధతి ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైలు, బస్సుల్లో ప్రయాణించేందుకు బస్‌పాస్‌లు జారీ చేయడంతో పాటు ప్రతినెల సెల్‌ఫోన్ బిల్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు జక్కుల నాగేశ్వరరావు, తేజావత్ రవినాయక్, మీసాల కిరణ్‌కుమార్, జడ శ్రీనివాస్, తన్నీరు మల్లికార్జున్, నాయకులు కామిశెట్టి రవికుమార్, వల్లపుదాసు కృష్ణ, కుక్కడపు కాశయ్య, చింతకాయల రాము పాల్గొన్నారు.