కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత! | BJP Activist Protest At Municipal Nomination Center In Kamareddy | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తలపై లాఠీలతో పోలీసుల దాడి!

Published Tue, Jan 14 2020 8:09 PM | Last Updated on Tue, Jan 14 2020 9:37 PM

BJP Activist Protest At Municipal Nomination Center In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: నగర మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిని బీ-ఫారం ఇచ్చి వెళ్లాలని ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. అలాగే ఇతర అభ్యర్థులు ఆయనపై దాడికి యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ కింద పడిపోయాడు. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలతో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. 

ఇక కౌన్సిలర్‌ సీట్లను అమ్ముకున్నారంటూ బీజేపీ అభ్యర్థులు మున్సిపల్‌ నామినేషన్‌ విత్‌ డ్రా సెంటర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో బీ-ఫారం ఫామ్‌ను చింపెందుకు అభ్యర్థులు యత్నించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ ఆశవాహులు సైతం మున్సిపల్‌ విత్‌ డ్రా సెంటర్‌ వద్ద ఆందోళన చేశారు. సిట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement