పిడుగుపాటుకు యువకుడి మృతి | The young man killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడి మృతి

Published Tue, Mar 14 2017 10:49 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

పిడుగుపాటుకు యువకుడి మృతి - Sakshi

పిడుగుపాటుకు యువకుడి మృతి

  • మరో ముగ్గురికి గాయాలు
  •  
    బుక్కపట్నం (అనంతపురం) : బుక్కపట్నం మండలం కొత్తకోటలో మంగళవారం పిడుగుపాటుకు ఓ యువకుడు దుర్మరణం చెందగా, అతడి తల్లితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...  కొత్తకోట గ్రామానికి చెందిన చిత్ర కేశప్ప భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు జయచంద్ర గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి చింతచెట్టు కాయలు దులిపేందుకు సమీపంలోని కొండకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షం రావడంతో చెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టు కింద ఉన్న జయచంద్ర (21) అక్కడిక్కడే మృతి చెందగా,  అతని తల్లి ఆదిలక్ష్మమ్మతో పాటు గ్రామానికి చెందిన నారాయణ, నరసమ్మలు గాయపడ్డారు.  పిడుగుపడిన గంట తర్వాత సమీపంలోని గొర్రెల కాపర్లు వారిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.  విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్‌ ఉషారాణి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆర్డీటీ బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడు జయచంద్ర బుక్కపట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement