Bolt from the blue
-
English Idiom: ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ.. అర్థం తెలుసా?
తనకు బుకర్‌ప్రైజ్ వచ్చిన సందర్భంగా రచయిత్రి గీతాంజలి శ్రీ తొలి స్పందనగా ఇలా అన్నారు... ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ! అనుకోని సంఘటన, ఊహించని ఫలితం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్ ఇది. ఇక దీని మూలాల విషయానికి వస్తే... ప్రశాంతమైన ఆకాశం ఉన్నట్టుండి ఉరుముతుంది. ఎక్కడో పిడుగుపడుతుంది...ఇదంతా ఊహకు అందనిది. మరొకటి ఏమిటంటే... మధ్యయుగాల కాలంలో యుద్ధాలలో ‘క్రాస్బో’(అడ్డవిల్లు)ను ఉపయోగించేవారు. సాధారణ విల్లుతో పోల్చితే ఇందులో నుంచి ప్రయోగించే ‘బోల్ట్’ ఎక్కువ దూరం దూసుకువెళుతుంది. టార్గెట్పర్సన్కు షూటర్ కనిపించడు. ఇది ఊహించనిది. ‘బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ’ థామస్ కార్లైల్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ (1857) పుస్తకంలో మొదటిసారిగా కనిపిస్తుంది. చదవండి: Brain Gym: భర్తను షూట్ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం? -
పిడుగుపాటుకు చీలిన తిరుమల ఘాట్ రోడ్డు
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌లో పిడుగుపాటుకు రోడ్డు చీలింది. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో ఆదివారం తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిగా వర్షం కురుస్తున్న సమయంలో బస్సుకు 20 మీటర్ల దూరంలో ఉదయం 7.50 గంటల సమయంలో రెండో కిలోమీటరు సూచికరాయి వద్ద భారీ శబ్దంతో పిడుగు పడింది. క్షణాల్లో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవటంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశారు. పొగ తగ్గిన తరువాత రోడ్డు చీలినట్టు గుర్తించిన డ్రైవర్ ఘాట్ రోడ్డు సిబ్బందికి సమాచారం అందించారు. ఘాట్ రోడ్డు ఇంజినీర్లు వెంటనే అక్కడకు చేరుకుని చీలిన రోడ్డును పరిశీలించారు. మూడు అంగుళాల మందం, ఆరు అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు పరిమాణంలో రోడ్డు చీలినట్లు గుర్తించారు. వర్షం కురుస్తుండటంతో ఆ ప్రాంతాన్ని మెత్తని ఎర్రమట్టితో నింపారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
మరో ముగ్గురికి గాయాలు బుక్కపట్నం (అనంతపురం) : బుక్కపట్నం మండలం కొత్తకోటలో మంగళవారం పిడుగుపాటుకు ఓ యువకుడు దుర్మరణం చెందగా, అతడి తల్లితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కొత్తకోట గ్రామానికి చెందిన చిత్ర కేశప్ప భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు జయచంద్ర గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి చింతచెట్టు కాయలు దులిపేందుకు సమీపంలోని కొండకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టు కింద ఉన్న జయచంద్ర (21) అక్కడిక్కడే మృతి చెందగా, అతని తల్లి ఆదిలక్ష్మమ్మతో పాటు గ్రామానికి చెందిన నారాయణ, నరసమ్మలు గాయపడ్డారు. పిడుగుపడిన గంట తర్వాత సమీపంలోని గొర్రెల కాపర్లు వారిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ ఉషారాణి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆర్డీటీ బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడు జయచంద్ర బుక్కపట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. -
పిడుగుపాటుకు 11 పశువులు మృతి
జన్నారం : మండలంలోని కామన్పల్లిలో పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతి చెంద గా, ఇద్దరు మేకల కాపరులకు గాయాలయ్యా యి. గ్రామస్తులు శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మేకలు కాసేందుకు కామన్‌పల్లికి చెందిన దుర్గం లచ్చన్న, కామెర చిన్న బక్కన్న ఊరి పొలిమేరకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం రావడంతో చెట్టుకింద తలదాచుకున్నారు. పిడుగు పడడంతో నాలు గు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సమీపంలో ఉన్న లచ్చన, బక్కన్నకు గాయా లై పడిపోవడంతో గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని మండలకేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి 108లో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తానూరు : మండలంలోని వడ్గాం గ్రామంలో శుక్రవారం పిడుగుపాటుతో రైతు ఆనంద్‌రావుకు చెందిన రెండు పశువులు మృతి చెందాయి. సాయంత్రం పశువులను మేపి గ్రామ సమీపంలోని చెట్టుకింద కట్టేశాడు. పిడుగు పడడంతో ఆవు, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. చించోలి (బి)లో ఐదు గొర్రెలు.. సారంగాపూర్ : మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన బోనగిరి నర్సయ్య, నాగన్నకు చెందిన ఐదు గొర్రెలు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. బాధితుల కథనం ప్రకారం ఉదయం నుంచి సాయంకాలం వరకు గొర్రెలను మేపుకుని తిరిగి ఇంటికి పయనమయ్యే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇది గమనించిన గొర్రెల కాపరులు వెంటనే గొర్రెలను తీసుకుని గ్రామానికి బయల్దేరారు. ఇదే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడటంతో గొర్రెల మంద చెల్లాచెదురైంది. తేరుకుని చూసేలోపు బోనగిరి నర్సయ్యకు చెందిన నాలుగు, నాగన్నకు చెందిన ఒక గొర్రె మృత్యువాత పడ్డాయి. ఈప్రమాదంలో నర్సయ్య రూ. 25వేలు, నాగన్న రూ.6వేలు నష్టపోయామని బాధితులు రోదిస్తూ తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు పరిహాం అందించాలని కోరారు. -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
♦ పలుచోట్ల మూగజీవాలూ మృత్యువాత ♦ సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు పిడుగుపాటుకు సోమవారం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. శంషాబాద్ మండలం పెద్దతూప్రకు చెందిన నల్లోల్ల జగన్నాథం కుమారుడు శ్రీకాంత్ (18), చేవెళ్ల మండలం పామెనకు చెందిన వడ్డే అనంతయ్య కుమారుడు నవీన్ (15), మొయినాబాద్ మండలం తోలుకట్టకు చెందిన కోమటి నర్సింహ(48) మృతి చెందిన వారిలో ఉన్నారు. జిల్లాలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. శంషాబాద్ రూరల్/చేవెళ్ల రూరల్/మొయినాబాద్ : జిల్లాలోని వేర్వేరు ప్రాం తాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మండలం పెద్దతూప్ర గ్రామానికి చెందిన నల్లొల్ల జగన్నాథం కొడుకు శ్రీకాంత్ (18), నల్లొల్ల నర్సింహ కుమారుడు లోకేష్ సోమవారం గేదెలు మేపడానికి పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగుపడడంతో గేదెలు మేపుతున్న శ్రీకాంత్, లోకేష్ తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోకేష్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన వడ్డే అనంతయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు వడ్డే నవీన్ (15) 10వ తరగతి చదువుతున్నాడు. కాగా.. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో నవీన్ సోమవారం తండ్రితో పాటు పశువులను మేపేం దుకు పొలానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో వర్షం పడింది. దీంతో తం డ్రీకొడుకులు దగ్గరనే ఉన్న చెట్టు వద్దకువెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడు గు పడడంతో నవీన్ అక్కడిక క్కడే మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతిచెందడంతో అనంతయ్య బోరున విలపించాడు. అదేవిధంగా చేవెళ్లలో ఎం పీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాలీహౌస్ వద్ద ఉన్న తుమ్మ చెట్టుపై ఈ పిడుగు పడింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామానికి చెందిన రైతు కోమటి నర్సింహ (48) వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పొలంలో పంటికూరు విత్తనాలు చల్లేందుకు కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి వెళ్లాడు. పొలం వద్దకు చేరుకోగానే.. వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగుపడింది. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు వెళుతునేన శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డాడు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాద్దెలు మృతి కందుకూరు : పిడుగు పాటుకు గురై రెండు మూగజీవాలు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని ముచ్చర్లలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి గ్రామంలో వర్షంతో పాటు పిడుగుపడింది. దీంతో గ్రామానికి చెందిన గార్లపాటి అంజయ్యకు చెందిన గేదెతో పాటు చేగూరి బాషయ్యకు చెందిన దూడ పిడుగు పాటుకు గురై మృతిచెందాయి. -
పిడుగుల వాన.. 12 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రానికి పిడుగుపాటు. పలు జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు గురై 12 మంది మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ జిల్లాలో... సం గెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు (33) ఆదివారం పొలంలో కలుపు తీస్తున్న క్రమంలో ఆయన సమీపంలో చలి పిడుగు పడింది. షాక్‌కు గురైన రాజును గమనించిన చుట్టుపక్కల రైతులు సంగెం పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రాజుకు భార్య కల్పన, ఇద్దరు కుమారులు రాహుల్, చిన్నా ఉన్నారు. నిరుపేద కౌలు రైతు అర్ధంతరంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారుు. ఎస్‌ఎస్‌తాడ్వారుు మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ వీఆర్ఏ కోలుకుల నర్సింహులు (48) తన ఇంటి పక్కన దుక్కిటెద్దును కట్టేస్తున్న సమయంలో పిడుగుపడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఎద్దుకూడా చనిపోరుుంది. మంగపేట మండలం రామచంద్రునిపేట పంచాయతీ పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన చౌలం సమ్మక్క(75) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లాలో... జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ పరిధి కాన్కూర్‌లో పిడుగుపాటుకు ఆదే కమలాకర్(23) మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లి వస్తుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయూ డు. జన్నారం మండలం చింతగూడకు చెందిన సీపతి విజయ(32) పొలంలో పని చేస్తుండగా ఆదివారం పిడుగుపాటుకు గురై చనిపోరుుం ది. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌కు చెందిన రైతు సిద్ధం రాజయ్య(61) ఆది వారం మధ్యాహ్నం దుక్కి దున్నుతున్నాడు. వర్షం రావడంతో చెట్టుకింద కూర్చున్నాడు. పిడుగుపడటంతో చెట్టుకిందనే ప్రాణాలు విడిచాడు. కరీంనగర్ జిల్లాలో... మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అంబాల సంజీవ్(30) ఆదివారం బొమ్మాపూర్‌లో కూలీకి వెళ్లాడు. క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తుండగా పిడుగుపాటుకు గురై పొలంలోనే మరణించాడు. సంజీవ్‌కు భార్య దివ్య, కుమారులు అంజి(4), లక్కీ(1) ఉన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన భాసిరెడ్డి నారాయణరెడ్డి(49) ఆదివారం చేనులోని గుడిసెలోకి వెళ్లగా గుడిసెపై పిడుగుపడి మరణించాడు. కోరుట్ల మండలం చినమెట్‌పల్లికి చెందిన బాడల లింగమ్మ(65) తమ మొక్కజొన్న చేనులో కంకులు విరిసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగుపడగా అక్కడికక్కడే మృతిచెందింది. తిమ్మాపూర్ మండలం పొరండ్లలో కిన్నెర కొమురయ్య అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. నిజామాబాద్‌లో... భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ శివారులో పిడుగుపాటుకు గురై నాగరాణి (25) అనే మహిళా రైతు మృతి చెందింది. అత్త కొత్తాల సాయమ్మతో కలసి పొలంలో పనిచేస్తుండగా వర్షం పడటంతో వారు చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా, సాయమ్మ తీవ్ర గాయాలపాలైంది. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరులో పిడుగుపాటుతో గడ్డం గోపాల్‌రెడ్డి(65) అనే రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండా పరిధిలోని చోక్లాతండాకు చెందిన బానోత్ సక్కు (30) ఇంటి ముందు ఉతికి ఆరేసిన దుస్తులు తీసుకొస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే మండలం మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి పిడుగుపడి తునికి వెంకటేశ్‌కు చెందిన పాడిగేదె మృత్యువాతపడింది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఆదివారం పిడుగుపాటుకు వేముల గాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన రెండు పాడి ఆవులు మృతిచెందాయి. దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పరిధి ముదిగొండ గ్రామ పంచాయతీ ఎర్రభగ్యాతండాకు చెందిన రాత్లావత్ దోడ్కాకు చెందిన 9 మేకలు చనిపోయాయి. -
పిడుగుపాటుకు ఆరుగురి మృతి
♦ బోగోలులో మూడు గంటలపాటు వర్షం ♦ స్తంభించిన జనజీవనం బిట్రగుంట : బోగోలు మండలంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలపాటు కురిసిన వర్షానికి ఒక వ్యక్తి మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కొండబిట్రగుంటకు చెందిన పశువులకాపరి చల్లా వెంకయ్య (60) మృతిచెందగా, ఏనుగులబావిలో భార్య, భర్త తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు కప్పరాళ్లపల్లితిప్పలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. చిల్లకూరు: మండలంలోని కోరివారిపాళెంలో ఆదివారం పిడుగుపాటుకు గురై ఉప్పల పెద రమణయ్య (60) మృతిచెందారు. మధ్యాహ్నం వర్షం వచ్చే సూచనలుండటంతో చెట్టు కింద ఆగాడు. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా పిడుగుపడటంతో రమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వరికుంటపాడు: మండలంలోని పామూరుపల్లె పంచాయతీ తొడుగుపల్లె గ్రామశివార్లలో పిడుగుపడటంతో నక్కల నాగేశ్వరరావు (45) అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కొడవలూరు: పిడుగుపాటుతో మండలంలోని దామేగుంట మజరా కొండాయపాలెంలో ఆదివారం రాయి ప్రసాద్ (34) అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవడంతో సమీపంలోని తాటిచెట్టు కిందకు వెళ్లాడు. పిడుగుపడటంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిడుగుపాటుకు తండ్రీకొడుకు వెంకటాచలం: ఉరుములు, మెరుపులు, పిడుగులతో గంటపాటు బీభత్సం సృష్టించిన గాలివాన తండ్రీకొడుకును బలితీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, వెంకటకృష్ణాపురానికి చెందిన సైదు వెంకటరావు (34), కుమార్ (9) పిడుగుపాటుకు గురై ఆదివారం మృతిచెందారు. వెంకటరావు వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో కండలేరు క్రీక్‌లో చేపలవేట, రొయ్యల గుంట సాగుచేస్తూ జీవనం సాగించేవాడు. వెంకటరావుకు 12 ఏళ్ల కుమార్తె రాణి, భార్య జ్యోతి ఉన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరామలింగారెడ్డి, వీఆర్వో మురహరి, ఎస్సై వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. -
పిడుగు కాటు
అరండల్‌పేట(గుంటూరు) : జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన బండారు ఆనందరావు(చిన్నోడు, 50) పశుగ్రాసం తీసుకువచ్చేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఒక్కసారిగా పిడుగుపడటంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న గొల్లపూడి మధు, అనపర్తి దానియేలు, మందా నాగమేల్లేశ్వరి, మందా మనీషా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా చేబ్రోలులో గౌడపాలేనికి చెందిన ఉయ్యూరు వెంకటనారాయణ(60) పొలానికి వెళ్లగా పిడుగుపాటుకు మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన పిన్నక శివరాంబాబు(60) హరిశ్చంద్రాపురంలోని తన పొలంలో దమ్ము పనులు జరుగుతుండగా పరిశీలించడానికి వెళ్లారు. అన్న వెంకటేశ్వర్లు దమ్ముచేస్తుండగా ఆయన గొడుగుతో పొలంగట్టుపై నిల్చొని ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో శివన్నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. తప్పిన పెను ప్రమాదం.. మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ - త్రిపుర అండర్-19 మహిళల జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిపివేసి క్రీడాకారులంతా డ్రస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో డ్రస్సింగ్రూమ్కు వందమీటర్ల దూరంలో ఉన్న ఓ తాడిచెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి క్రీడాకారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్లలో కుండపోత వర్షం కురిసింది. దీంతో గోళ్ళపాడు ప్రధాన ర హదారిపై నీరు నిలిచిపోయింది. తెనాలి పట్టణం, రూరల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే చేబ్రోలు మండలం నారాకోడూరు, గుండవరం, గొడవర్రు తదితర గ్రామాల్లోని దొండ, కాకర, చిక్కుడు పందిరి తోటలు కూలిపోయాయి. దీంతో కూరగాయ రైతులకు వేలాది రూపాయిల పంట నష్టం చేకూరింది. కొత్తరెడ్డిపాలెం సెంటర్లోని వందేళ్ల చరిత్ర ఉన్న మహావృక్షం ఈదురుగాలులకు వేళ్లతో సహా కూలిపోయింది. గుంటూరు నగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైన్లుపొంగి ప్రవహించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
శనగపాడు (పెనుగంచిప్రోలు) : మండలంలోని శనగపాడులో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (35), కీసర ఇసాక్ (28), మరో పది మంది వ్యవసాయ కూలీలు గ్రామ శివారులోని సుబాబుల్ కర్ర కొట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడటంతో ఇంటికి బయలుదేరారు. మార్గం లో పిడుగు పడటంతో రాజారత్నం, ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందారు. ము నేరు మధ్య లంకల్లో గేదెలు మేపేందుకు వెళ్లిన కోనంగి శక్తేశ్వరరావు (22) కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో తొలుత నందిగామకు, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు రోడ్డుపై రంధ్రాలు పడ్డాయి. గ్రామంలో విషాదం... ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవటంతో రాజారత్నం, ఇసాక్ కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. రాజారత్నంకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇసాక్‌కు భార్య, ఐదేళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందటంపై శక్తేశ్వరరావు కుటుం బ సభ్యులు శోకసముద్రంతో మునిగిపోయారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కె.నాగేశ్వరరావు, ఎంపీడీవో వై.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ కె.సతీష్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామకు తరలించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా ఈ ఘటనలో మృతులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. -
అకాల వర్షం...భారీనష్టం..!
►రాళ్లవానతో రాలిపోయిన ధాన్యం ►ఈదురు గాలులతో ఇళ్లపై ఎగిరిపోయిన పై కప్పులు ►అవుసలపల్లిలో పిడుగుపాటుకు పాడిగేదె, దున్నపోతు మృతి ►కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ►ప్రభుత్వమే ఆదుకోవాలి బాధితుల వినతి మెదక్ రూరల్ : అకాలవర్షంతో తీవ్రనష్టం వాటిల్లింది. చేతికందిన పంటంతా నేలపాలైంది సంఘటన మండల పరిధిలోని పలుగ్రామాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి ఈదురుగాలులతో రాళ్లవర్షం పడింది. దీంతో మండల పరిధిలోని పాతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రలోని ధాన్యం తడిసి ముదైంది. అలాగే భయంకరమైన ఈదురుగాలులతో మండలంలోని ఔరంగాబాద్ గిరిజన తండాలోని పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. తండాకు చెందిన నానావత్ భాస్కర్ అనేవ్యక్తి ఇంటిపై ఉన్న సిమెంటు రేకులు గాలిధాటికి ఎగిరి వందగజాల దూరంలో పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగున బయటకు వచ్చి వేరేవారి ఇంట్లో తలదాచుకున్నారు. అవుసులపల్లి గ్రామానికి చెందిన కందుల రాములు అనేరైతు పాడిగేదెను, దున్నపోతును వ్యవసాయపొలం వద్ద చెట్టుకు కట్టేయగా పిడుగుపడడంతో మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.60 వేలనష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పిడుగు పడిన చోట నిలబడితే మంచుపై నిలబడినంత చల్లగా ఉంది. దీనిని బట్టి ఇది చలిపిడుగై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పిడుగు పడిన సమయంలో భయంకరమైన శబ్దం వచ్చి మెరుపు మెరిసిందని పిడుగు పడిన ప్రదేశానికి తాను కొద్దిదూరంలో ట్రాక్టర్ కింద తలదాచుకున్నానని బాధిత రైతు తెలిపాడు. గేదే మృత్యువాత పడటంతో తాను జీవనాధారం కోల్పోయానని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాళ్లవర్షంతో అవుసులపల్లి శివారులోని కోతకు వచ్చిన వరిపొలంలోని వడ్లు రాలిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కలేదని, మరో వారం రోజుల్లో కోతకోద్దామనుకుంటున్న సమయంలో అకాలవర్షం తమను ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు, బాధితులు కోరుతున్నారు. అయోమయంలో అన్నదాత కొల్చారం: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ఈ ప్రాంత అన్నదాతలు అయోమయంలో పడ్డారు. సాయంత్రం 5గంటలకు చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం పెద్దదిగా మారడంతో రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలా మేరకు తడిసింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
గాలివాన బీభత్సం : ఎడ్లు మృతి
సారంగాపూర్, న్యూస్‌లైన్ : మండలంలో శుక్రవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా గాలి వీయడంతో పొట్ట, కోత దశలో ఉన్న వరి పంటలు నేలకొరిగాయి. విక్రయించడానికి సిద్ధంగా ఉన్న పసుపు, మొక్కజొన్న పంటల దిగుబడి తడిసిపోయింది. మామిడికాయలు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మండలంలో 200 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గాలివాన ప్రభావంతో పలు గ్రామాల్లో రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో జామ్, ధని, అడెల్లి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి 7.30గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం కారణంగా తాగునీరు దొరక్క ఇబ్బందుల పాలయ్యామని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో పిడుగుపాటుకు మాజీ సర్పంచు సోమ భూమన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి. ఎడ్లను పశువుల పాకలో కట్టి ఉంచగా.. గాలివానకు పైకప్పు ఎగిరిపోయింది. ఆ తర్వాత పిడుగుపాటుకు ఎడ్లు మృతిచెందాయి. స్థానిక పశు వైద్యాధికారి ముక్త్యార్ పంచనామా నిర్వహించారు.