పిడుగుల వాన.. 12 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రానికి పిడుగుపాటు. పలు జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు గురై 12 మంది మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ జిల్లాలో... సం గెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు (33) ఆదివారం పొలంలో కలుపు తీస్తున్న క్రమంలో ఆయన సమీపంలో చలి పిడుగు పడింది. షాక్‌కు గురైన రాజును గమనించిన చుట్టుపక్కల రైతులు సంగెం పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
రాజుకు భార్య కల్పన, ఇద్దరు కుమారులు రాహుల్, చిన్నా ఉన్నారు. నిరుపేద కౌలు రైతు అర్ధంతరంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారుు. ఎస్‌ఎస్‌తాడ్వారుు మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ వీఆర్‌ఏ కోలుకుల నర్సింహులు (48) తన ఇంటి పక్కన దుక్కిటెద్దును కట్టేస్తున్న సమయంలో పిడుగుపడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఎద్దుకూడా చనిపోరుుంది. మంగపేట మండలం రామచంద్రునిపేట పంచాయతీ పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన చౌలం సమ్మక్క(75) పిడుగుపాటుకు గురై మృతి చెందింది.
ఆదిలాబాద్ జిల్లాలో...
జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ పరిధి కాన్కూర్‌లో పిడుగుపాటుకు ఆదే కమలాకర్(23) మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లి వస్తుండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయూ డు. జన్నారం మండలం చింతగూడకు చెందిన సీపతి విజయ(32) పొలంలో పని చేస్తుండగా ఆదివారం పిడుగుపాటుకు గురై చనిపోరుుం ది. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌కు చెందిన రైతు సిద్ధం రాజయ్య(61) ఆది వారం మధ్యాహ్నం దుక్కి దున్నుతున్నాడు. వర్షం రావడంతో చెట్టుకింద కూర్చున్నాడు. పిడుగుపడటంతో చెట్టుకిందనే ప్రాణాలు విడిచాడు.
కరీంనగర్ జిల్లాలో...
మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అంబాల సంజీవ్(30) ఆదివారం బొమ్మాపూర్‌లో కూలీకి వెళ్లాడు. క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తుండగా పిడుగుపాటుకు గురై పొలంలోనే మరణించాడు. సంజీవ్‌కు భార్య దివ్య, కుమారులు అంజి(4), లక్కీ(1) ఉన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన భాసిరెడ్డి నారాయణరెడ్డి(49) ఆదివారం చేనులోని గుడిసెలోకి వెళ్లగా గుడిసెపై పిడుగుపడి మరణించాడు. కోరుట్ల మండలం చినమెట్‌పల్లికి చెందిన బాడల లింగమ్మ(65) తమ మొక్కజొన్న చేనులో కంకులు విరిసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపుల వర్షంతో పిడుగుపడగా అక్కడికక్కడే మృతిచెందింది. తిమ్మాపూర్ మండలం పొరండ్లలో కిన్నెర కొమురయ్య అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు.
నిజామాబాద్‌లో...
భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ శివారులో పిడుగుపాటుకు గురై నాగరాణి (25) అనే మహిళా రైతు మృతి చెందింది. అత్త కొత్తాల సాయమ్మతో కలసి పొలంలో పనిచేస్తుండగా వర్షం పడటంతో వారు చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా, సాయమ్మ తీవ్ర గాయాలపాలైంది. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరులో పిడుగుపాటుతో గడ్డం గోపాల్‌రెడ్డి(65) అనే రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండా పరిధిలోని చోక్లాతండాకు చెందిన బానోత్ సక్కు (30) ఇంటి ముందు ఉతికి ఆరేసిన దుస్తులు తీసుకొస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది.
ఇదే మండలం మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి పిడుగుపడి తునికి వెంకటేశ్‌కు చెందిన పాడిగేదె మృత్యువాతపడింది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఆదివారం పిడుగుపాటుకు వేముల గాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన రెండు పాడి ఆవులు మృతిచెందాయి. దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పరిధి ముదిగొండ గ్రామ పంచాయతీ ఎర్రభగ్యాతండాకు చెందిన రాత్లావత్ దోడ్కాకు చెందిన 9 మేకలు చనిపోయాయి.