పిడుగుపాటుకు 11 పశువులు మృతి
జన్నారం : మండలంలోని కామన్‌పల్లిలో పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతి చెంద గా, ఇద్దరు మేకల కాపరులకు గాయాలయ్యా యి. గ్రామస్తులు శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మేకలు కాసేందుకు కామన్‌పల్లికి చెందిన దుర్గం లచ్చన్న, కామెర చిన్న బక్కన్న ఊరి పొలిమేరకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం రావడంతో చెట్టుకింద తలదాచుకున్నారు. పిడుగు పడడంతో నాలు గు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సమీపంలో ఉన్న లచ్చన, బక్కన్నకు గాయా లై పడిపోవడంతో గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని మండలకేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి 108లో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తానూరు : మండలంలోని వడ్‌గాం గ్రామంలో శుక్రవారం పిడుగుపాటుతో రైతు ఆనంద్‌రావుకు చెందిన రెండు పశువులు మృతి చెందాయి. సాయంత్రం పశువులను మేపి గ్రామ సమీపంలోని చెట్టుకింద కట్టేశాడు. పిడుగు పడడంతో ఆవు, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి.
చించోలి (బి)లో ఐదు గొర్రెలు..
సారంగాపూర్ : మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన బోనగిరి నర్సయ్య, నాగన్నకు చెందిన ఐదు గొర్రెలు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. బాధితుల కథనం ప్రకారం ఉదయం నుంచి సాయంకాలం వరకు గొర్రెలను మేపుకుని తిరిగి ఇంటికి పయనమయ్యే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇది గమనించిన గొర్రెల కాపరులు వెంటనే గొర్రెలను తీసుకుని గ్రామానికి బయల్దేరారు. ఇదే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడటంతో గొర్రెల మంద చెల్లాచెదురైంది. తేరుకుని చూసేలోపు బోనగిరి నర్సయ్యకు చెందిన నాలుగు, నాగన్నకు చెందిన ఒక గొర్రె మృత్యువాత పడ్డాయి. ఈప్రమాదంలో నర్సయ్య రూ. 25వేలు, నాగన్న రూ.6వేలు నష్టపోయామని బాధితులు రోదిస్తూ తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు పరిహాం అందించాలని కోరారు.