పిడుగుపాటుకు ముగ్గురు బలి
♦ పలుచోట్ల మూగజీవాలూ మృత్యువాత
♦ సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు
పిడుగుపాటుకు సోమవారం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. శంషాబాద్ మండలం పెద్దతూప్రకు చెందిన నల్లోల్ల జగన్నాథం కుమారుడు శ్రీకాంత్ (18), చేవెళ్ల మండలం పామెనకు చెందిన వడ్డే అనంతయ్య కుమారుడు నవీన్ (15), మొయినాబాద్ మండలం తోలుకట్టకు చెందిన కోమటి నర్సింహ(48) మృతి చెందిన వారిలో ఉన్నారు. జిల్లాలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.
శంషాబాద్ రూరల్/చేవెళ్ల రూరల్/మొయినాబాద్ : జిల్లాలోని వేర్వేరు ప్రాం తాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మండలం పెద్దతూప్ర గ్రామానికి చెందిన నల్లొల్ల జగన్నాథం కొడుకు శ్రీకాంత్ (18), నల్లొల్ల నర్సింహ కుమారుడు లోకేష్ సోమవారం గేదెలు మేపడానికి పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగుపడడంతో గేదెలు మేపుతున్న శ్రీకాంత్, లోకేష్ తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శ్రీకాంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోకేష్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.
చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన వడ్డే అనంతయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు వడ్డే నవీన్ (15) 10వ తరగతి చదువుతున్నాడు. కాగా.. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో నవీన్ సోమవారం తండ్రితో పాటు పశువులను మేపేం దుకు పొలానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో వర్షం పడింది. దీంతో తం డ్రీకొడుకులు దగ్గరనే ఉన్న చెట్టు వద్దకువెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడు గు పడడంతో నవీన్ అక్కడిక క్కడే మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ల ముందే మృతిచెందడంతో అనంతయ్య బోరున విలపించాడు. అదేవిధంగా చేవెళ్లలో ఎం పీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాలీహౌస్ వద్ద ఉన్న తుమ్మ చెట్టుపై ఈ పిడుగు పడింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది.
మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామానికి చెందిన రైతు కోమటి నర్సింహ (48) వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం పొలంలో పంటికూరు విత్తనాలు చల్లేందుకు కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి వెళ్లాడు. పొలం వద్దకు చేరుకోగానే.. వర్షం, ఉరుములు, మెరుపులతో పిడుగుపడింది. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు వెళుతునేన శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డాడు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
కాద్దెలు మృతి
కందుకూరు : పిడుగు పాటుకు గురై రెండు మూగజీవాలు మృతి చెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని ముచ్చర్లలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి గ్రామంలో వర్షంతో పాటు పిడుగుపడింది. దీంతో గ్రామానికి చెందిన గార్లపాటి అంజయ్యకు చెందిన గేదెతో పాటు చేగూరి బాషయ్యకు చెందిన దూడ పిడుగు పాటుకు గురై మృతిచెందాయి.