బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం | america team in bukkapatnam | Sakshi
Sakshi News home page

బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం

Published Mon, Jun 26 2017 9:55 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం - Sakshi

బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం

- కుండపద్ధతిలో మామిడి సాగు పరిశీలన
బుక్కపట్నం : మండలంలో కుండలతో సాగవుతున్న మామిడి తోటలను సోమవారం అమెరికా ప్రతినిధి బృందం పరిశీలించింది. బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి రైతులు ఇండో–జర్మన్‌ ప్రాజెక్టులో భాగంగా కుండల పద్ధతిలో మామిడి తోటలు సాగు చేశారు. అమెరికా ప్రతినిధి బృంద సభ్యులు నటాలియా, నటాలి, శాలినోశర్మ, గోపాల్‌ ఆధ్వర్యంలో కుండ పద్ధతిని క్షేత్రస్థాయిలో అధ్యనయం చేయడానికి వచ్చారని ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వారు రైతులతో నేరుగా మాట్లాడి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో టీఏ శేఖర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement