హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల మధ్య మరో సబ్ రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాలానగర్ సబ్‌రిజిస్టార్‌గా పని చేస్తున్న యూసుఫ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేటలతో పాటు నగరంలోని మరో 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సబ్ రిజిస్టార్‌ను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.