విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని సబ్ రిజిస్ట్రార్ పోతురాజు ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడుల చేశారు.
ఇప్పటి వరకు రూ. కోటి 20 లక్షలకు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. అయితే దాడులు కొనసాగుతున్నాయి. పోతురాజు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.