నూజివీడు (కృష్ణా జిల్లా) : మార్ట్‌గేజ్ డాక్యుమెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ను శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్గా పనిచేస్తున్న ఆర్‌వీపీ ధర్మలింగేశ్వర్రావు.. నూజివీడుకు చెందిన శివసాయి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
మార్ట్‌గేజ్ డాక్యుమెంట్ కోసం కార్యాలయానికి వెళ్లిన శివసాయిని సబ్‌రిజిస్ట్రార్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేయడంతో శివసాయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ ఎసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ.. ధర్మలింగేశ్వర్రావు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
Published Fri, Jul 31 2015 5:16 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement