భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సబ్‌రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
గుంటూరు: భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సబ్‌రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఓ వ్యక్తిని రూ. 10 వేలు డిమాండ్ చేశాడు.
ఆ వ్యక్తి తాను అంత ఇచ్చుకోలేనని రూ.5 వేలు ఇస్తానని చెప్పి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదనపు సమాచారం కోసం విచారణ చేస్తున్నారు.