ఐ.పోలవరం (ముమ్మిడివరం) :
లంచం తీసుకుంటూ ఐ.పోలవరం సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు దొరికి పోయారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం టి.కొత్తపలి్లకి చెందిన మట్లా ఏసుబాబు కుటుంబసభ్యులకు ఉన్న 3.10 ఎకరాలు 9మంది పార్టిష¯ŒS డీడ్ ఈనెల 27న ఐ.పోలవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS చేయించారు. ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ.24 వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చివరకు రూ.13వేలకు అంగీకరించారు. సబ్ రిజిస్ట్రార్ తీరుతో విసుగెత్తిన రైతు ఏసుబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, సబ్ రిజిస్ట్రార్ లంచం అడిగిన ఆడియోను అందజేశారు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం రూ.13వేలకు పౌడర్, రంగు వేసి ఏసుబాబుతో సబ్ రిజిస్ట్రార్‌కు ఇప్పించారు. లంచం తీసుకొంటూ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏలూరు ఏసీబీ అధికారి విల్సన్, ఎస్సై నరేష్ సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను విచారించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు.