‘ఉన్నవి రెండు కాలాలు. ఆమెని ప్రేమించిన కాలం. ప్రేమించకుండా ఉండలేని కాలం’ అనే నందకిశోర్ రెండో కవితాసంపుటి ‘యథేచ్ఛ’ డిసెంబర్ 2017లో వచ్చింది (మొదటి సంపుటి ‘నీలాగే ఒకడుండేవాడు!’). ప్రచురణ: వాకిలి. అందులోంచి ఒక కవిత:
భూమి దప్పిక తీర్చేందుకు
ఆకాశం గొంతుకోసినవాడు
దేవుడు
చిక్కటి రాత్రి మొహమ్మీద
చుక్కల దిష్టి పెట్టినవాడు
దేవుడు
కళ్లు తెరవని పసికందుని చంపి
నిద్రపోగలవాడు
దేవుడు
అస్సలు స్పృహ తెలియకుండా
అడవి చుట్టూ పంజరమల్లినవాడు
దేవుడు
-నందకిశోర్
Comments
Please login to add a commentAdd a comment