ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే నా కవిత్వం | Poetry Review About Durgapuram Road | Sakshi
Sakshi News home page

ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే నా కవిత్వం

Published Mon, Nov 25 2019 1:33 AM | Last Updated on Mon, Nov 25 2019 1:33 AM

Poetry Review About Durgapuram Road - Sakshi

కవిత్వం అన్ని సందర్భాలకీ, సన్నివేశాలకీ, సమయాలకూ వర్తించే ధిక్కారం. కనీ కనిపించని, వినీ వినిపించనీ వేదన, సంవేదన. ‘"But I am the man/ And I'll be there/ And I may cause the lips of those who are asleep to speak/ And I may make my notebooks into sheaves of grass/ And I may write my own eponymous epitaph/ Instructing the horsemen to pass/ I am a tear of the sun' A° Lawrence Ferlinghetti అన్నట్టు– ఉషోదయ వేళ తుషార బిందువుల్లో సొగసుగానూ, అపరాహ్ణం వేళ గాలికి ఊగుతూ జ్ఞాపకాలు తలపోసుకుంటున్నట్టుగానూ, సంధ్యవేళ నలుగురి పాదాల కిందా నలిగి అసహనంగానూ, తెంపబోతే గీసుకుని చేతిలో నెత్తురు చిమ్మే గడ్డిపోచల్లాగే పలు విధముల నా కవిత్వం కన్నీరై దౌడు తీస్తూంటుంది.

అందరూ ఎందుకిలా ఉన్నారు, లక్ష్యం ఒకటే అయినా మార్గాలెందుకు కలవడం లేదు, తరాలు గడిచిపోతున్నా వారు తలకెత్తుకోగలిగిందేపాటి, ఎవరిది నిర్లక్ష్యం, ఎందుకొచ్చిన అలసత్వం... ఒక్కటేమిటి; ఒక రకంగా చెప్పాలంటే నాకేమీ తెలీదేమోనని చిట్టడవిలో చొరవగా చొరబడిపోయిన కవిని నేనేమో? ఆ సందిగ్ధమే నా కవితా పాదాల్లోని అక్షరాలను దగ్ధం చేస్తుంది, ధగద్ధగాయమానమూ చేస్తుందేమో. నా వరకూ నేనేంటో, నా గుండె చప్పుడేంటో, నా కన్నీరేంటో, నా కలలేంటో, బిగుసుకునే పిడికిళ్లేంటో, విచ్చుకోబోయి ఒరిగిపోయిన స్వప్నాలేంటో, నాలో లీనమయ్యే ప్రపంచమేంటో, నా చుట్టూ సంచరించే సంగీతమేంటో, నా కంటికి కానరాని, మనోసీమకు అందని దుర్భిణీలో ప్రతిఫలించే అగాథమేంటో... ఏంటో, ఏంటేంటో– అదే నా కవిత్వం. అతీతమేమీ కాదు, అందరిలాంటిదే కవి జీవితమూ. లోభాలూ, మోహాలూ, ఆశలూ, ఆరాటాలూ, ఉద్యోగాలూ, ఉపాధీ, భార్యా, పిల్లలూ, సంసారం, కావల్సినన్ని కష్టాలు, కాసిన్ని కన్నీళ్లు, దోసెడు చిరునగవులు,

అప్పుడప్పుడు ఆకాశంపై ఎక్కుపెట్టే ఇంద్ర ధనస్సులూ... వీటన్నిటి మధ్య నుంచి ఆశయాలకీ, ఆచరణలకీ దూరంగా లాక్కెళ్లిపోతున్న సామాజిక పరిస్థితులు, అయినా ఎండమావులనీ, పగటి కలల్నీ నిజం చేయాలన్న మొండి పట్టుదలతో ముందుకు ఉరికితే, ఒరిగితే– మోకాలు పగిలి, పెదవి చిట్లితే... వెక్కిరించే పెదవుల మధ్య, వెనక్కి తిరిగి చూడని కళ్ల మధ్య నాకు చేయిచ్చి, ఆసరాగా నిలిచిందీ, నిలబెట్టిందీ కవిత్వమే. రెండు దశాబ్దాలు పైబడిన కవితాన్వేషణలో తొలిసారి ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’ నుంచి ఇప్పుడు ఇలా ఈ ‘దుర్గాపురం రోడ్‌’ మీదకు వచ్చి సంపుటిగా విచ్చుకోవడానికి ఇరవై ఏళ్లు పట్టినా, నిద్దట్లో పసివాడు అమ్మను హత్తుకున్నట్టు నేనెప్పుడూ కవిత్వం వేలిని విడిచిందీ లేదు. ‘్గౌu ఠీజీ ∙ ౌఠ్ఛి ్చజ్చజీn ్టజ్ఛి ట్టట్చnజ్ఛట ఠీజిౌ ఠ్చీటyౌuటట్ఛ జ’ అని ఈ్ఛట్ఛజు గ్చి ఛి్టౌ్ట అన్నట్టు నాతో నేను, కవిత్వంతో నేను– నిరంతరం ఓ సంక్లిష్ట మథనమే. 
    -దేశరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement