తెలిసింది సైన్స్ తెలియనిది మేజిక్ | Vasam song and trailer released | Sakshi
Sakshi News home page

తెలిసింది సైన్స్ తెలియనిది మేజిక్

Published Fri, Oct 28 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

తెలిసింది సైన్స్ తెలియనిది మేజిక్

తెలిసింది సైన్స్ తెలియనిది మేజిక్

పంచభూతాలను నియంత్రించే శక్తి సంపాదించిన ఓ మనిషి, తనలో మానవత్వాన్ని కోల్పోయాడా? సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాడా? అనే కథతో రూపొందిన చిత్రం ‘వశం’. శ్రీకాంత్ చల్లా దర్శకత్వంలో వాసుదేవ్ రావు, కృష్ణేశ్వరరావు, శ్వేతావర్మ, నంద కిశోర్, అక్షయ్ ముఖ్యతారలుగా శుకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ప్రచార చిత్రాలు విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరిలు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మనకు తెలిసింది సైన్స్, తెలియనిది మేజిక్.

సైన్స్ అనేది స్పిరిచ్యువాలిటీలో ఓ భాగం మాత్రమే. ఈ చిత్రంలో సైన్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ కలిపి తీసుకున్నాం. మనిషి వాటిని నియంత్రించగలడా? అనే అంశాలను ప్రస్తావించాం. నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దుర్గాకిశోర్, రవికిరణ్, పాటలు: చక్రవర్తుల, సంగీతం: జోస్యభట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement