
బిగ్‌బాస్ సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అన్‌స్టాపబుల్. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కమెడియన్ సప్తగిరి మరో హీరోగా నటిస్తుండగా.. నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్ల. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత దిల్‌రాజు విడుదలచేశాడు.
రజిత్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కుటుంబంతో సహా నవ్వుకునే చిత్రమిది’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను’’ అన్నారు రజిత్ రావు. ఈ సినిమాకు షేక్ రఫీ, బిట్టు(నర్సయ్య న్యవనంది) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment