
‘మెకానిక్’ చిత్రం మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంకంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment