‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ ఇదే.. | RRR Movie Title Logo And Motion Poster Released | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల.. 

Published Wed, Mar 25 2020 12:36 PM | Last Updated on Wed, Mar 25 2020 12:50 PM

RRR Movie Title Logo And Motion Poster Released - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ ఉగాది కానుకగా బుధవారం చిత్రబృందం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌- ‘రౌద్రం  రణం రుధిరం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. మోషన్‌ పోస్ట్‌ర్‌లో ఎన్టీఆర్‌ నీటిలో నుంచి, రామ్‌చరణ్‌ నిప్పులో నుంచి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశాల్ని చూపించారు.


కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరీస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement