ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్‌లుక్‌, 3D మోషన్ పోస్టర్ విడుదల | Aadi Sai Kumar Top Gear Movie First Look And Motion Poster Release | Sakshi
Sakshi News home page

Aadi Sailumar: ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్‌లుక్‌, 3D మోషన్ పోస్టర్ విడుదల

Published Sat, Sep 17 2022 8:57 PM | Last Updated on Sat, Sep 17 2022 8:57 PM

Aadi Sai Kumar Top Gear Movie First Look And Motion Poster Release - Sakshi

యంగ్‌ హరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ టాప్ గేర్. ఇటీవలె విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ లోగోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసి మరో అప్‌డేట్‌ను అందించి చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్‌తో అలరించబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే. ఇకపోతే ఈ మోషన్‌ పోస్టర్‌ సరికొత్తగా 3డీలో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

కాగా శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మూవీస్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పొందుతోంది. ఇందులో ఆది సరసన రియా సుమన్ నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement