కోలీవుడ్ స్టార్ ధునుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జగమే తంత్రం’అనే పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. చొక్కా, పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులు భయపెట్టేలా ఉన్నాయి. దీంతో మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమాతో పండగే అని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ధనుష్‌కు ఇది 40వ చిత్రం కావడంతో ‘డి 40’అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరిపారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న రిలీజ్ కానుంది.
‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్
Published Thu, Feb 20 2020 8:48 AM | Last Updated on Thu, Feb 20 2020 8:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment