
సూరజ్ పవన్, శీతల్ భట్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఒక అమ్మాయితో’. ‘కోవిడ్ టైమ్ కహానీ’ అనేది ఉపశీర్షిక. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. వి.భట్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
గార్లపాటి రమేష్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫీల్ గుడ్ మూవీలా వస్తున్న మా సినిమాలో యూత్‌కు తగ్గ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ, ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘త్వరలో విడుదలవుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మురళి బోడపాటి. ‘‘ఒక అమ్మాయితో’ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సూరజ్ పవన్. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ రమణ, సంగీత దర్శకుడు కన్ను సమీర్, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, నటులు అశోక్ కుమార్, శ్రీ రాగ్, సురేష్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment