నందమూరి తారకరత్న హీరోగా నటించిన తాజా చిత్రం సారథి. జాకట రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైశాలి హీరోయిన్‌గా నటించారు. పంచభూత క్రియేషన్స్‌పై పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి. సిద్ధేశ్వర్ రావు నిర్మించిన ఈ మూవీ మోషనల్ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఖోఖో గేమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచన అందరిలో రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది. కరోనా మహమ్మారిలో ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారకరత్నికి ధన్యవాదాలు. సిద్ధార్‌థ్ వాటికన్ సంగీతం అలరిస్తుంది' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి.
Comments
Please login to add a commentAdd a comment