
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ధనుష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనకిది 40వ చిత్రం కావడంతో.. ధనుష్ అభిమానులు D40 పేరుతో హాష్‌టాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది.
వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ‘జగమే తంత్రం’ నిర్మించాయి. ఎస్. శశికాంత్ నిర్మాతగా, సహ నిర్మాతగా చక్రవర్తి రామచంద్రన్ వ్యవహరించారు. ఇక భిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే కార్తీక్ సుబ్బరాజ్.. ‘పేట’ సినిమాలో రజనీ వయసును 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. రజనీకాంత్‌కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్ ధనుష్‌తో ఛాన్స్ కొట్టేశాడు. జిగర్‌తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి కార్తీక్ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమాలు.
Comments
Please login to add a commentAdd a comment