ఎవరి పుట్టిన రోజును వాళ్లే జరుపుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మాత్రం ఆయన అభిమానులందరూ పండగలా జరుపుకుంటారు. అదీ మెగా హీరోకు ఉన్న క్రేజ్. రేపు(శనివారం) ఆయన పుట్టిన రోజు. ఇంకొన్ని గంటల్లో ఆయన 65వ వడిలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో మెగా అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. మరోవైపు తండ్రికి మొదటి బర్త్‌డే విషెస్ చెప్పారు హీరో రామ్‌చరణ్. నాన్న పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు కామన్ డీపీని కూడా విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను ఒక్కో మెట్టుపై ఉంచారు. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!)
"ఖైదీ" నుంచి మొదలై "ఖైదీ నంబర్ 150" వరకు ఉన్న పాత్రలను మెట్లపై నిలిపి చూపించారు. వీటి మధ్యలో 'పసివాడి ప్రాణం', 'స్వయంకృషి', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర' చిత్రాలకు సంబంధించిన పాత్రలున్నాయి. కానీ రాజకీయాల్లో వెళ్లి బ్రేక్ తీసుకున్న సమయానికి సంకేతంగా కొన్ని మెట్లను ఖాళీగా వదిలేశారు. ఇక మెగాస్టార్ టైటిల్ మధ్యలో మాత్రం "సైరా నరసింహారెడ్డి" పాత్రను నిలిపారు. "రక్తదానం చేయండి - ప్రాణాలు కాపాడండి" అన్న మెగాస్టార్ నినాదంతో పాటు "ప్లాస్మా దానం చేసి కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి" అని ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు 'హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్' అంటూ చిరంజీవి కామన్ పోస్టర్‌ను కూడా వదిలారు. బీజీఎమ్‌తో అదరగొడుతున్న ఈ వీడియోలో ఆయన సూపర్ హిట్ సినిమాల పోస్టర్లు కనిపిస్తాయి. చివర్లో అందరికీ చెక్ పెట్టే రాజుగా హైలుక్‌లో కనిస్తారు. (వీరిలో ఓ వ్యక్తి మీకు బాగా తెలుసు..)
Comments
Please login to add a commentAdd a comment