స్వామి ఆవిష్కరణ.. | Om Namo Venkatesaya motion poster released | Sakshi
Sakshi News home page

స్వామి ఆవిష్కరణ..

Published Sat, Jul 30 2016 7:15 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Om Namo Venkatesaya motion poster released

అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. స్వామి ఆవిష్కరణ అంటూ వేంకటేశ్వరుడి పాత్ర పోషిస్తున్న నటుడు సౌరభ్ను పరిచయం చేశారు. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. రేపే శ్రీవారి దర్శనం అంటూ శుక్రవారం రాఘవేంద్ర రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎప్పటికప్పుడు చిత్ర షూటింగ్ విశేషాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement