ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లలతో! | K Raghavendra Rao Announced His Next Project | Sakshi
Sakshi News home page

ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లలతో!

Published Tue, May 28 2019 12:14 PM | Last Updated on Tue, May 28 2019 12:14 PM

K Raghavendra Rao Announced His Next Project - Sakshi

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశారు.

‘నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR’ అంటూ ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు.

2017లో రిలీజ్ అయిన ఓం నమో వేంకటేశాయ సినిమా తరువాత రాఘవేంద్ర రావు మరో సినిమా చేయలేదు. ఒక దశలో ఆయన ఇక రిటైర్మెంట్‌ తీసుకున్నట్టే అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబందించిన ఎనౌన్స్‌మెంట్‌ రావటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement