నిజామాబాద్‌లో నాగార్జున ప్రత్యేక పూజలు | Om Namo venkatesaya team Special Prayers in Indur Tirumala temple | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో నాగార్జున ప్రత్యేక పూజలు

Published Thu, Feb 9 2017 11:17 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

నిజామాబాద్‌లో నాగార్జున ప్రత్యేక పూజలు - Sakshi

నిజామాబాద్‌లో నాగార్జున ప్రత్యేక పూజలు

నర్సింపల్లి : నిజామాబాద్‌ జిల్లాలో టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున సందడి చేశారు. నర్సింపల్లిలోని ఇందూరు తిరుమల దేవాలయాన్ని నాగార్జున, నిర్మాత దిల్‌రాజుతో పాటు ఓం నమో వెంకటేశాయ చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు.

గురువారం ఉదయం ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వేంకటేశ్వరుని పరమ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న హథీరాం బాబా జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. నాగార్జునతో పాటు అనుష్క, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా కనిపించడం మరో విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement