నెక్ట్స్ సంక్రాంతికి 'శ్రీనివాస కళ్యాణం' | Dil Raju, Sateesh Vegesna srinivasa Kalyanam | Sakshi
Sakshi News home page

నెక్ట్స్ సంక్రాంతికి 'శ్రీనివాస కళ్యాణం'

Published Wed, Feb 22 2017 3:27 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నెక్ట్స్ సంక్రాంతికి 'శ్రీనివాస కళ్యాణం' - Sakshi

నెక్ట్స్ సంక్రాంతికి 'శ్రీనివాస కళ్యాణం'

సంక్రాంతి సీజన్లో భారీ విజయాలు నమోదు చేస్తూ రికార్డ్ సృష్టిస్తున్న నిర్మాత దిల్ రాజు, 2018 సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది శతమానంభవతి సినిమాతో ఆకట్టుకున్న దిల్ రాజు, భారీ చిత్రాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా డీజే దువ్వాడ జగన్నాథమ్, వరుణ్ తేజ్తో ఫిదా, రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు.. వచ్చే సంక్రాంతి సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.

ఈ సంక్రాంతికి శతమానంభవతితో ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే మరో సంక్రాంతి సినిమాను రెడీ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అంతేకాదు ఈ కథకు సీనియర్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో నాగార్జునను సంప్రదించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజుగారి గది 2 సినిమా చేస్తున్న నాగ్ తరువాత ఏ సినిమా అంగీకరించలేదు. సతీష్ చెప్పే కథ నచ్చితే వెంటనే శ్రీనివాస కళ్యాణం సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement